కరోనా వైరస్ దెబ్బకు జనాల సోషల్ లైఫ్ డిస్ట్రబ్ అయిపోయింది. రెస్టారెంట్లు, పబ్ల జోలికి వెళ్లాలంటనే భయపడే పరిస్థితి వచ్చేసింది. లాక్డౌన్ ఎత్తేసినా కొన్నాళ్లపాటు సినిమాహాల్స్, మాల్స్, రెస్టారెంట్లు, బార్లు ఓపెన్ చేయకూడదని ప్రభుత్వం భావిస్తోంది. ఒకవేళ రెస్టారెంట్లు ఓపెన్ చేసినా వైరస్ ఎక్కడ సోకుతుందోనన్న భయంతో జనం వాటివంక చూస్తారా లేదా అన్నది కూడా సందేహమే. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సమస్యకు పరిష్కారం తీసుకొచ్చాం అంటోంది ఫుడ్ డెలివరీయాప్ జొమాటో. జొమాటో కాంటాక్ట్ లెస్ డైనింగ్ పేరుతో ఓ కొత్త ఫీచర్ను ప్రవేశపెట్టబోతోంది.
ఎందుకీ కాంటాక్ట్ లెస్ డైనింగ్?
సాధారణంగా మనం రెస్టారెంట్కు వెళితే మెనూకార్డ్ చేతికి ఇస్తారు. అది చూసి మనం ఆర్డర్ ఇస్తాం. దాన్ని మేనేజర్ ఓ స్లిప్ మీద రాసుకుంటాడు. అవి తీసుకెళ్లి కిచెన్లో ఇస్తే దాన్ని బట్టి ఆర్డర్ తయారుచేసి వెయిటర్ మనకు పట్టుకొచ్చి పెడతాడు. తిన్నాక మనం డబ్బులిస్తాం. చిల్లర ఇస్తే తిరిగి తీసుకుంటాం. లేదంటే కార్డ్ స్వైప్ చేస్తాం. వీటన్నింటిలో ఒకరికి పది చేతులేసే వాడే వస్తువులే ఉన్నాయి. అందుకే కాంటాక్ట్ను వీలైనంత తగ్గించడమే లక్ష్యంగా కాంటాక్ట్ లెస్ డైనింగ్ ఫీచర్ను తెచ్చామని జొమాటో చెబుతోంది.
ఏమిటీ కాంటాక్ట్లెస్ డైనింగ్?
దీనిలో మీరు ముందే రెస్టారెంట్లో టేబుల్ బుక్ చేసుకోవచ్చు. దాన్ని హైజీన్గా ఉంచడానికి రెస్టారెంట్ ఏర్పాట్లు చేస్తుంది. మీకు
శానిటైజర్ కూడా అందుబాటులో ఉంచుతుంది.
* రెస్టారెంట్కి వెళ్లాక మెనూ కార్డ్ క్యూఆర్ కోడ్ కనిపిస్తుంది. దాన్ని జొమాటో యాప్లో చూసి ఆర్డర్ చేస్తాం. అది ఆన్లైన్లో రెస్టారెంట్ యాజమాన్యానికి వెళుతుంది. వాళ్లు ఫుడ్ ఆర్డరిస్తారు. ఆ ఫుడ్ను వెయిటర్ తెస్తారు. తిన్నాక బిల్ ఎంత అయిందో యాప్లో నోటిఫికేషన్ వస్తుంది. మీరు దాన్ని యాప్తో పేచేసేయాలి.
* ఇందులో వండే కుక్, తెచ్చే వెయిటర్ తప్ప ఇంక ఎక్కడా కాంటాక్ట్ ఉండదు. వాళ్లు కూడా ఆరోగ్యంగా ఉండేలా జొమాటో చెక్ చేయిస్తుంది. జ్వరం, జలుబు లాంటివి ఉంటే ఆ స్టాఫ్ను రెస్టారెంట్లో డ్యూటీకి అనుమతించరు.
* టేబుల్స్, చైర్స్, కట్లరీ ఎప్పటికప్పుడు డిస్ ఇన్ఫెక్టెంట్ చేస్తారు.
బిజినెస్ చేయాలంటే తప్పదని..
ఇప్పటికే రెస్టారెంట్లు మూతపడి నెలరోజులయింది. ఎన్నాళ్లకు తీస్తారో తెలియదు. తీశాక కూడా జనం రాకపోతే బిజినెస్లు మూతపడడం ఖాయం. మరోవైపు వైరస్ భయంతో జనం ఆన్లైన్ ఆర్డర్లు ఇవ్వక జొమాటో లాంటి యాప్స్ బెంబేలెత్తిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో కస్టమర్లను ఆకర్షించాలంటే ఇలాంటి ప్రయత్నాలు తప్పవంటోంది జొమాటో. జనం ఈ ప్రయత్నాన్ని ఎంత ఆదరిస్తారో లాక్డౌన్ ఎత్తేసి, రెస్టారెంట్లు ఓపెన్ చేస్తేగానీ తెలియదు. అప్పటి దాకా వెయిట్ అండ్ సీ.
 Coronavirus COVID-19 Zomato  Contactless Dining జొమాటో జొమాటో కాంటాకà±à°Ÿà± లెసౠడైనింగౠక‌రోనా వైర‌సà±â€Œ క‌రోనా లాకà±â€Œà°¡à±Œà°¨à±â€Œ Â